అమెరికాలో గుడివాడ ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయి ఆరోపణలు వెల్లువెత్తుతున్న వైనం
రిపోర్టర్: శ్రీకాంత్ రెడ్డి
స్థలం: గుడివాడ
గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముపై అమెరికాలో తీవ్ర ఆరోపణలు వస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఆయన అమెరికాలో హెచ్-వన్ బి కన్సల్టెన్సీల ద్వారా నిబంధనలు ఉల్లంఘించారని, ఉద్యోగుల వేతనాలు చెల్లించలేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలపై స్థానికంగా మరియు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై అధికారిక స్పందన రావాల్సి ఉంది.