'హక్కుల సాధన సభ'కు తరలిరండి..: జేఏసీ కన్వీనర్ భగత్ పిలుపు

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ :ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న హక్కుల సాధన సభకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 10 వేల మంది ఉద్యోగులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ ధరణికోట భగత్ తెలిపారు. బుధవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో సభ పోస్టర్ను ఆవిష్కరించారు. పీఆర్సీ నివేదికను వెంటనే తీసుకోవాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.