ఆసియా హాకీ టోర్నీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లేకపోవడంపై గోల్ కీపర్ స్పందన

రిపోర్టర్: వెంకట్ స్థలం: Punjab

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ లేకపోవడం వల్ల కొంత నిరుత్సాహం ఉన్నప్పటికీ, డిఫెండింగ్ ఛాంపియన్గా టైటిల్ను నిలబెట్టుకోవడంపైనే పూర్తి దృష్టి పెట్టామని గోల్ కీపర్ సూరజ్ కర్కెరా తెలిపారు. పాకిస్థాన్ వైదొలగడంతో బంగ్లాదేశ్ జట్టు టోర్నీలోకి వచ్చిందని, తమ లక్ష మాత్రం విజయం సాధించడమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాలు మన నియంత్రణలో ఉండవని, మైదానంలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే ఆటగాళ్ల కర్తవ్యమని పేర్కొన్నారు.