బీఆర్‌ఎస్‌లోకి భారీగా కాంగ్రెస్ బీజేపీ నేతల చేరికలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం జాఫర్ గఢ్ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించగా, ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యతో పాటు పలువురు స్థానిక బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.