బరువు తగ్గడంలో ప్రోటీన్, ఫైబర్ పాత్ర: ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు

రిపోర్టర్: సతీష్ స్థలం: బెంగళూరు

శ్రీమతి అదితి ప్రసాద్ ఆప్టే తెలిపిన వివరాల ప్రకారం బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ మరియు ఫైబర్ సమపాళ్లలో తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రొటీన్ ఆకలిని తగ్గించే హార్మోన్లను ప్రేరేపించి కండరాలను కాపాడితే, పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేసి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. సరైన మోతాదులో వీటిని తీసుకోవడం ద్వారా సులభంగా కొవ్వును కరిగించుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.