తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు మరియు 23 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారడంతో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం సహా మొత్తం 23 జిల్లాలకు అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.