తమిళనాడులో కొత్త సచివాలయం నిర్మాణంపై ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: వెంకట్
స్థలం: తమిళనాడు
చెన్నైలోని పట్టినపాక్కం శీనివాసపురం వద్ద నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టడంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు సేవ చేయడానికి తప్ప ముఖ్యమంత్రి సముద్రాన్ని చూస్తూ కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు. జీవోను వెంటనే ఉపసంహరించుకోకపోతే మత్స్యకారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల ప్రజలు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.