మంగళూరులో రౌడీ జనార్దన షూటింగ్లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రష్మిక మందన్నతో కలిసి నటించిన రణబాలి సినిమా షూటింగ్, డబ్బింగ్ పనులను ఆయన విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌడీ జనార్దన సినిమా కోసం విజయ్ మంగళూరు వెళ్లారు. అక్కడ ప్రస్తుతం కీలక యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నట్లు సమాచారం.