అమరావతి నుంచి ఆదేశాలిస్తేనే జిల్లా అధికారుల్లో కదలిక వస్తోందంటూ విమర్శలు
రిపోర్టర్: సునీల్
స్థలం: అనకాపల్లి
గత వైకాపా ప్రభుత్వ పాలనలో జరిగిన అక్రమాలు, భూ ఆక్రమణలపై ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారుల్లో ఎలాంటి స్పందన లేదని, అమరావతి నుంచి ఆదేశాలు వస్తేనే జిల్లా యంత్రాంగం కదులుతోందని స్థానికులు మండిపడుతున్నారు. కశింకోట మండలం విస్సన్నపేటలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పట్లో జనసేనాని పవన్ కల్యాణ్ పరిశీలించినా, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావస్తున్నా బాధ్యులపై తగిన చర్యలు లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.