మందులు కొన్నప్పుడు బిల్లు తీసుకోండి: లేదంటే తీవ్ర అనారోగ్య ముప్పు తప్పదు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
మందులు కొనుగోలు చేసేటప్పుడు ప్రతిసారీ తప్పుకుండా బిల్లు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. మార్కెట్లో నకిలీ, నాసిరకం మందులు పెరుగుతున్నందున బిల్లు ఉంటేనే బ్యాచ్ నంబరు ఆధారంగా తయారీదారులపై చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని వెల్లడించారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మాత్రలు, అబార్షన్ కిట్లు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని, షాపుల లైసెన్స్లు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.