సమావేశంలో కంటతడి పెట్టిన వైకాపా నేత బొత్స సత్యనారాయణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో జరిగిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా చలించిపోయారు. సొంత మేనల్లుడు తెదేపాలో చేరడం, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అక్కడున్న నేతలు ఆయన్ను ఓదార్చారు.