రేవన్న నేతృత్వంలో కీలక రెవెన్యూ శాఖ అత్యవసర సమీక్ష

రిపోర్టర్: గోపి స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖపై అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌తో పాటు పలువురు అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. వివాదాస్పద 22ఏ నిషేధిత భూముల జాబితా, పెండింగ్ సమస్యలపై చర్చిస్తున్నారు. బుధవారం జరిగే శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం దిశానిర్దేశం చేస్తున్నారు.