వృద్ధాప్య సమస్యలతో కన్నుమూసిన సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్.రవిచంద్ర
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్.ఎస్.రవిచంద్ర(84) అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో మంగళవారం తుదిశ్వాస విడిచారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆయన, కృష్ణ, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. హిందీలోనూ పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం అంత్యక్రియలు హైదరాబాద్‌లోనే జరగనున్నాయి.