కూలీ పనులు చేస్తూ ఆసియా క్రీడల వరకు ఎదిగిన భారత సెపాక్ తక్తా క్రీడాకారుడు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మణిపూర్
భారత పురుషుల సెపాక్ తక్తా కెప్టెన్ ఆకాశ్ యుమ్నమ్ మణిపూర్ నుంచి ఏసియన్ గేమ్స్ వరకు సాగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. తండ్రి మరణం తరువాత కుటుంబ పోషణ కోసం రోజువారీ కూలీగా పని చేస్తూనే క్రీడల్లో రాణించి నాలుగోసారి ఆసియా క్రీడలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.