స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలపై జరుగుతున్నది పూర్తిగా దుష్ప్రచారమే
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీకాకుళం
మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల కేటాయింపుపై వస్తున్న ఆరోపణలను ఒక అభ్యర్థి తీవ్రంగా ఖండించారు. తాను ఎనిమిదేళ్లు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేశానని, పోస్టల్ శాఖలోనూ కొలువు సాధించానని గుర్తుచేశారు. ఉపాధ్యాయుడు కావాలనే ప్యాషన్ తోనే డీఎస్సీ సాధించానని, గత ప్రభుత్వ హయాంలోనూ తనకు ఉద్యోగం వచ్చిందని స్పష్టం చేశారు. తాను అన్ని అర్హతలతో నిబంధనల ప్రకారమే ఉద్యోగం సాధించానని తెలిపారు.