ప్రభుత్వ ఆసుపత్రులలో గుండె వైద్య సేవలను విస్తరిస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో గుండె సంబంధిత వైద్య సేవలను విస్తరించడానికి మరియు పేదలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చికిత్స కోసం పేదలు సుదూర ప్రయాణాలు చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రులలోనే గుండె సంరక్షణ అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. గుండె వైద్య నిపుణుల లభ్యత పెంచేందుకు పీజీ కోర్సులలో కొత్త సీట్లు ప్రవేశపెట్టడంతో పాటు రూ. 34 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.