అక్రమ ఫామ్ హౌస్ లపై కాంగ్రెస్ నాయకుల మొయినాబాద్ పర్యటన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Moinabad

బీఆర్ఎస్ నేతల అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలను ప్రజలకు చూపించేందుకు కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధులు మొయినాబాద్ మండలంలోని అజీజ్ నగర్ లో పర్యటించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ బృందం అక్రమ నిర్మాణాలను పరిశీలించింది. నిబంధనలకు విరుద్ధంగా రిసార్ట్స్, ఫామ్ హౌస్ లు నిర్మించారని కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.