పంట నష్టంపై అధికారుల ప్రత్యేక దృష్టి: ఓబనపల్లిలో ఎమ్మెల్యే పరిశీలన

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

రైల్వేకోడూరు మండలం ఓబనపల్లిలో భారీ వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. వర్షం కారణంగా నష్టపోయిన అరటి తోటలను తిలకించి రైతులతో మాట్లాడారు. నష్ట వివరాలు నమోదు చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రైతులు అధైర్యపడవద్దని ఆయన భరోసా కల్పించారు. అధికారులు వెంటనే సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.