త్వరలో సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల తేదీల షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేయనుంది. షెడ్యూల్ విడుదలైన తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.gov.in ద్వారా పరీక్షల సమయాలు, తేదీలు మరియు గైడ్‌లైన్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది.