ఆదర్శ కుటుంబం సినిమా: ఏపీలో టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
విక్టరీ వెంకటేష్ మరియు శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఆదర్శకుటుంబం హౌస్ నెం.47 సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకు మల్టీప్లెక్సుల్లో డెబ్బై ఐదు రూపాయలు, సింగిల్ స్క్రీన్లలో యాభై రూపాయల మేర ధరలు పెంచుకునేందుకు వెసులు కల్పించారు. అలాగే పది రోజులపాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.