'దేశం అగ్రగామిగా ఉండాలి, ఏపీ లీడ్ చేయాలి': సీఎం చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Amaravati

దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండి లీడ్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఒక ప్రజాధినేతగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపడానికి తాము పట్టుదలతో అడుగులు వేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.