తుఫాన్ ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన: రైతులకు సర్కార్ భరోసా

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పశ్చిమ గోదావరి

ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నర్సాపురం మండలం కొత్తనవరసపురంలో నీటమునిగిన పంట పొలాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను స్వయంగా తెలుసుకుని ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారని జలవనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందజేస్తామని, నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఆయన స్పష్టం చేస్తూ స్థానిక ప్రజలకు ధైర్యం చెప్పారు.