గణేష్ విగ్రహాల ఇనుప స్క్రాప్ ప్రైవేట్ పరం చేస్తున్న వైనం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
గణేష్ నిమజ్జనం అనంతరం మిగిలిపోతున్న కోట్ల విలువైన ఐరన్ వ్యర్థాలు ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతున్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఏడేళ్లుగా భారీగా స్క్రాప్ అన్యాక్రాంతం అవుతోందని వారు మండిపడ్డారు. హుస్సేన్ సాగర్ తో పాటు వివిధ చెరువుల వద్ద నిమజ్జనం తర్వాత నిరుపయోగంగా మారుతున్న ఇనుప పైపులు, రాడ్లను అధికారికంగా వేలం వేయడంలో అధికారులు విఫలమయ్యారని పర్యావరణవేత్తలు తీవ్ర విమర్శలు గుప్పించారు.