వైద్య ప్రవేశాల నిబంధనల్లో కీలక మార్పులు చేసిన ప్రభుత్వం

రిపోర్టర్: రాజేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో ప్రైవేట్ వైద్య, దంత వైద్య కళాశాలల్లో యూజీ, పీజీ ప్రవేశాల నిబంధనలను ప్రభుత్వం సవరించింది. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశాలన్నీ ఆన్‌లైన్ సెంట్రలైజ్డ్ వెబ్ కౌన్సెలింగ్ ద్వారానే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఎంబీబీఎస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్, యాజమాన్య సీట్లకు శనివారం నుంచి ఐచ్ఛికాల నమోదు ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది.