వాట్సప్‌పై ఉన్న శ్రద్ధ ఫైళ్ల క్లియరెన్స్‌పై లేదా?: సీఎం చంద్రబాబు ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సప్ మెసేజ్‌లపై చూపే శ్రద్ధ దస్త్రాల క్లియరెన్స్‌పై ఎందుకు ఉండదని నిలదీశారు. ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారా అని మండిపడ్డారు. ఫైళ్లు పెండింగ్‌లో పెట్టే అధికారులపై వేటు తప్పదని, నిర్ణయాల్లో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేస్తూ పాలనా వేగం పెంచాలని హెచ్చరించారు.