స్థానిక సంస్థల ఎన్నికలపై గుంటూరులో టీడీపీ నేతల కీలక భేటీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: గుంటూరు
గుంటూరు సాయిబాబా రోడ్డులోని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు నివాసంలో గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు విస్తృతంగా చర్చించారు. వందశాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి లోకేష్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ ఎంపీ భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.