తుఫాను సన్నద్ధతపై ఎస్.కోటలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

రిపోర్టర్: BHAVANI THADI స్థలం: విజయనగరం

తుఫానును ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధతను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఎస్.కోట నియోజకవర్గంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పునరావాస కేంద్రాలు, ప్రాథమిక సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, కంట్రోల్ రూమ్లను నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.