మృత్యు కుహరాలుగా మారిన రహదారులపై పెల్లుబికిన ప్రజాాగ్రహం

రిపోర్టర్: venkat స్థలం: కుక్కునూరు

వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట నుంచి కోయిదా వరకు రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కట్కూరు నుంచి టేకూరు వంతెన వరకు రోడ్డు కొంతమేర బాగున్నా, అక్కడి నుంచి కోయిదా వరకు పెద్ద గుంతలు, కొట్టుకుపోయిన రోడ్లతో ప్రయాణం నరకప్రాయంగా మారింది. వర్షపు నీరు గుంతల్లో నిలిచిపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంబులెన్సుల రాకపోకలకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు నిత్యం పడుతున్న ఈ అవస్థలపై అధికారులు తక్షణమే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.