కొత్త పెన్షన్ల దరఖాస్తులో ఇంటి పన్ను నంబర్ నిబంధన రద్దు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఉన్న ఇంటి పన్ను అసెస్మెంట్ నంబర్ నిబంధనను ఎత్తివేసింది. ఈ నిబంధన వల్ల పేదలు పడుతున్న ఇబ్బందిని గుర్తించి ప్రభుత్వం సడలింపునిచ్చింది. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరూ అసెస్మెంట్ నంబర్ లేకుండానే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది.