టెలిప్రొంప్టర్ పనిచేయక ప్రసంగం మధ్యలోనే ఆపేసిన ప్రిన్స్ హ్యారీ
రిపోర్టర్: రాజేష్
స్థలం: న్యూయార్క్
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతున్న క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ వార్షిక సమావేశంలో ప్రిన్స్ హ్యారీ ప్రసంగిస్తుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పిల్లలపై కృత్రిమ మేధస్సు, సోషల్ మీడియా ప్రభావం గురించి ఆయన మాట్లాడుతున్న సమయంలో టెలిప్రొంప్టర్ ఆగిపోయింది. దీంతో అయోమయానికి గురైన హ్యారీ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపివేసి స్టేజ్ దిగి వెళ్లిపోయారు. సుమారు నలభై నిమిషాల తర్వాత తిరిగి వచ్చి తన ప్రసంగాన్ని పూర్తి చేశారు.