నేరాల నియంత్రణే లక్ష్యంగా శ్రీకాకుళంలో సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీకాకుళం

రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శాంతిభద్రతల పరిరక్షణ కోసం సమస్యాత్మక గ్రామాల్లో పల్లె నిద్ర నిర్వహించడం తప్పనిసరి అని శ్రీకాకుళం జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. ముందస్తు చర్యలతోనే నేరాలను పూర్తిగా నియంత్రించవచ్చని ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక పోలీసు అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఐలు, ఎస్సైలకు దిశానిర్దేశం చేశారు.