టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం: దేశవాళీ క్రికెట్ బరిలోకి హిట్ మ్యాన్

రిపోర్టర్: సతీష్ స్థలం: ముంబై

వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు టీమిండియా తరఫున కొనసాగాలని పట్టుదలగా ఉన్న స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఫామ్ కోల్పోకుండా నిరంతరం మ్యాచ్ ప్రాక్టీస్ పొందేందుకు ముంబై జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ వన్డేల్ లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ హిట్మ్యాన్, దేశవాళీ టోర్నీ ద్వారా బ్యాటింగ్ టచ్ కాపాడుకోవాలని చూస్తున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.