నారాయణవనం స్కూల్ కమిటీ చైర్మన్గా అరుణ ఏకగ్రీవ ఎన్నిక

రిపోర్టర్: kishor Kumarr m స్థలం: నారాయణవనం

తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెత్తలతడుకు మాదిగపల్లి పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. జ్యోతి పర్యవేక్షణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కమిటీ నూతన చైర్మన్గా ఎ. అరుణను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్గా టి. శశీంద్ర, పూర్వ విద్యార్థి, దాత హోదాలో గడ మధుమాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు.