నాణ్యత లేని వస్తువుల విక్రయంతో సీజ్ అయిన స్వీట్ హౌస్
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని వస్తువులతో తినుబండారాలు తయారు చేస్తున్న రాజస్థాన్ టీ స్టాల్ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేసి సీజ్ చేశారు. నాసిరకం పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో ఎవరైనా ఇలాంటి అభద్రతా చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని అధికారులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు.