ఉత్తరప్రదేశ్లో విక్రయించే అన్ని రకాల మిఠాయిలపై గడువు తేదీ తప్పనిసరి

రిపోర్టర్: రాజేష్ స్థలం: లక్నో

ఉత్తరప్రదేశ్లో విక్రయానికి ఉంచే అన్ని రకాల మిఠాయిలపై తయారీ మరియు గడువు తేదీలను ప్రదర్శించడం తప్పనిసరి చేస్తూ ఆహార భద్రత విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 15 నుండి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని కమిషనర్ డాక్టర్ రోషన్ జాకోబ్ వెల్లడించారు. విడి మిఠాయిల నాణ్యతపై వినియోగదారులకు స్పష్టతనిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే పాలు మరియు పాల ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎథిలీన్ గ్లైకాల్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.