పెద్దపల్లిలో లైంగిక వేధింపుల భరించలేక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.
రిపోర్టర్: సతీష్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి ఇంటర్న్‌షిప్ విద్యార్థిని లైంగిక వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. ఓవర్‌మ్యాన్ రవికుమార్, లెక్చరర్ నవీన్ వేధింపులపై యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తన మరణం ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడాలని సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. దళిత సంఘాల ఆందోళనతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.