'ఏదో ఒకటి ముందు ఫిక్స్ అవ్వు': సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన సంచలన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ తండ్రి కాలం నాటి నుంచే వందలాది ఎకరాల భూమి ఉందని స్పష్టం చేస్తూ, తమ బంధువుల ఆస్తులను కూడా కేసీఆర్ ఖాతాలో కలపడం దిగజడు రాజకీయాలకు నిదర్శనమని నిలదీశారు.