హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో కూలిన ఫాల్స్ సీలింగ్

రిపోర్టర్: విజయ్ స్థలం: హుస్నాబాద్

హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన ఆధునికీకరణ పనుల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని కౌన్సిలర్ గాదేపాక రవీందర్ పేర్కొన్నారు. గురువారం ఈదురు గాలులతో కురిసిన వర్షానికి బస్టాండ్లోని ప్లాట్ఫాం నంబర్ ఏడు వద్ద ఫాల్స్ సీలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక వర్షపు నీరు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.