బీహార్‌లో మైనర్లపై వేధింపుల ఘటనలో ముగ్గురి అరెస్ట్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Bihar
బీహార్‌లోని జముయి జిల్లాలో మైనర్ బాలుడు, బాలికను వేధించిన ఘటనకు సంబంధించి సోమవారం పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. బాధితులు ఫిర్యాదు చేయకపోయినా, వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు జముయి ఎస్పీ విశ్వజీత్ దయాల్ తెలిపారు. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.