సమృద్ధిగా వర్షాలు కురవాలని బిక్కవోలులో వరుణ యాగం: భగవంతుడిని ప్రార్థించిన నేతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: బిక్కవోలు

బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కర్తలుగా పాల్గొన్నారు. ఎంపీ పురందేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావం తొలిగి, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతాంగానికి మేలు జరగాలని వారు భగవంతుడిని వేడుకున్నారు.