చంద్రపాల్ మృతి పార్టీకి తీరని లోటన్న పల్లా వెంకటరెడ్డి

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుర్ల లింగం తండ్రి చంద్రపాల్ మరణించడం పార్టీకి తీరని లోటని సీపీఐ జాతీయ కార్యదర్శి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి అన్నారు. రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో చంద్రపాల్ పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.