క్రీడాస్ఫూర్తికి తూట్లు పొడిచిన వైనం: రెండేళ్ల నిషేధానికి గురైన క్రికెటర్

రిపోర్టర్: సతీష్ స్థలం: North Yorkshire

అంపైర్లను మోసగించేందుకు వేళ్లతో శబ్దం చేసి అడ్డంగా దొరికిపోయిన బ్రియాన్ డివైన్ పై నార్త్ యార్క్ షైర్ అండ్ సౌత్ డర్హాం క్రికెట్ లీగ్ కఠిన చర్యలు తీసుకుందని అధికారులు తెలిపారు. క్లిక్కీ పాంటింగ్ గా ప్రసిద్ధి చెందిన ఈ అమెచ్యూర్ క్రికెటర్ కు రెండేళ్లపాటు క్రీడపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సాల్ట్ బర్న్ క్రికెట్ క్లబ్ పై కూడా భారీ జరిమానా విధించి, లీగ్ లో దిగజార్చారు.