సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తమ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తమది తప్పని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే తాను హోటల్ ఏర్పాటు చేశానని, 2009 ఎన్నికల అఫిడవిట్ లోనే ఆస్తుల వివరాలు వెల్లడించానని కేటీఆర్ తెలిపారు. రేవంత్ సోదరుల ఆస్తులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.