హూతీల దాడులపై సౌదీకి అండగా నిలిచేందుకు ట్రంప్ నిరాకరణ
రిపోర్టర్: నరేష్
స్థలం: World
యెమెన్ లో హూతీ రెబల్స్ దాడులు ఉధృతం చేసిన వేళ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం కోరారు. హూతీలపై నేరుగా సైనిక దాడి చేయాలని సల్మాన్ విజ్ఞప్తి చేయగా, ట్రంప్ తిరస్కరించారు. కేవలం నిఘా సమాచారం, టార్గెట్లను గుర్తించడంలో మాత్రమే సహకరిస్తామని స్పష్టం చేస్తూ, పోరాట బాధ్యతను సౌదీ దేశాలే చూసుకోవాలని తేల్చిచెప్పారు.