ద్విచక్రవాహనం రూపంలో మృత్యువు: రోడ్డు దాటుతుండగా యువకుడు దుర్మరణం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఇందుకూరుపేట

ఇందుకూరుపేట మండలం నర్సాపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మేకల సురేశ్ అనే యువకుడు మృతి చెందాడు. నెల్లూరులో పెయింటింగ్ పనులు ముగించుకుని రాత్రి సమయంలో స్నేహితుడి వాహనం దిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సురేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. అనాథగా మారిన ఆ యువకుడి మృతితో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.