అగ్నికీలల కోరల్లో చిక్కుకుని బూడిదైన ఆర్టీసీ బస్సు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విశాఖపట్నం
నెల్లూరు నుంచి విశాఖపట్నం చేరుకున్న ఆర్టీసీ బస్సులో హఠాత్తుగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద వాల్తేరు డిపో పార్కింగ్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా భస్మీపటలమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర సాంకేతిక లోపాలా అనే అంశంపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు.