కోనసీమలో మెగాస్టార్ చిరంజీవి పర్యటన: నూతన హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించిన నటుడు
రిపోర్టర్: సతీష్
స్థలం: తూర్పు గోదావరి
ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జీఎస్ఎల్ ఆస్పత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్‌కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై మాట్లాడిన ఆయన, ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే హానిని గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. చాలా కాలం తర్వాత కోనసీమ ప్రాంతానికి ఆయన రావడంతో అభిమానుల్లో కోలాహలం నెలకొంది.