రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల రీషెడ్యూల్: నవంబర్ 5న పోలింగ్

రిపోర్టర్: శివ స్థలం: అమరావతి

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల పోలింగ్ తేదీలను మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటన విడుదల చేశారని అధికారులు తెలిపారు. నవంబర్ మూడున జరగాల్సిన పోలింగ్ను నవంబర్ ఐదుకు, ఐదున జరగాల్సిన కౌంటింగ్ను నవంబర్ ఏడుకు వాయిదా వేశారు. ఒకే రోజు రెండు ఎన్నికలు నిర్వహిస్తే పోలీసు సిబ్బంది కొరత తలెత్తుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.