ఢిల్లీలో కలకలం: పోలీసుల తీరుపై నిరసన తెలిపిన మహిళా జర్నలిస్టుల అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: ఢిల్లీ
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట రాత్రి అంతా నిరసన చేపట్టిన మహిళా జర్నలిస్టులు సహా పదిహేడు మందిని సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనను కవర్ చేస్తున్న సమయంలో తమపై దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన పోలీసు సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీరు ఆందోళన చేపట్టారు.