కళల కాసారంలో అంగరంగ వైభవంగా సంగీత నృత్య మహోత్సవాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో సంగీత, నృత్య మహోత్సవాలు–2026 ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ చాగంటి రాజ్యలక్ష్మి తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి 23వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రతిరోజూ సాయంత్రం వివిధ కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సంగీతం, నృత్యం, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, జానపద కళారూపాలతో ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. కళాభిమానులు, సంగీత, నృత్య ప్రియులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.